Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తీనామమునిల్పినాడు.
ఎందరనో శిష్యవరుల
తనయశఃపతాకలుగా
దేశమందు నిల్పినాడు.
ఆయన తనకొక్క గురువు
లేకున్నను ఆహరిదా
స జగద్గురువైనారు.
హరికథకోసమె ఆయన
అవతరించినాడొ లేక
ఆయనకోసమె హరికథ
అవతరించెనో చెప్పుట
కడు కష్టము. వాదమేల?
ఉభయపక్షములును సత్య
సమ్మతమ్ములంచు ఒప్పు
కొనుట ప్రాజ్ఞలక్షణమ్ము!
బహిరంతర బంధురస
దృక్తిభావనా శేవధి[1]
యో ఆరూపమ్ము భార
తీయ సంవిత్ సార సర్వ
ధూర్వహ[2], మా మహావ్యక్తి
గాన నృత్య సాహిత్య
మ్ములు మొదలౌ కళల, కౌశ
లమ్ము పేశలమ్ము గాన
ఆ మూర్తియు స్వయంగాను
హరికథోపన్యాసమ్మును
చెప్పువేళ సన్నివేశ
మున సనకసనందులు, శా
రదచతురాస్యులు, నారద
తుంబురులును పార్వతిపర
మేశ్వరులును కాళిదాస
షేక్స్పియరులు కలసినట్లు
గా సాక్షాత్కారము నొన
రించినట్లు కనుపించును.
ఆ మహాత్ముహరికథనము
మూలంగా భక్తిభావ
మా సామాన్యుల యందున
జీవమ్మును పోసుకొనెను.
సద్భావము పెంపొందెను.
వివిధకళా రసికతలును
వికసించెను. అత్యపూర్వ
మౌ ఆయన కథాకథన
బంధుర వైదగ్ధ్యానికి
స్పందించని డెందమంటు
లేనేలేదు. లోకంలో
హరికథాపితామహుండు
హరిదాసజగద్గురుండు
ఆవు నాయన గాన రూప
కథాఖ్యానమును, కైటభు 103
అరిసంకీర్తనము అయిన
యక్షగాన పూర్వరూప
మునకు పునర్భవము ప్రసా
దించి దాని కపూర్వమ్ము
చిరస్థాయికమ్ము నయిన
ప్రతిష్ఠను పటిష్ఠము గా
వించినట్టి వాగ్దేవీ
ప్రియవయస్యు డైన భట్టు
నటరాజుకు గగనతలము
ఎట్లు రంగస్థల మయ్యెనొ

  1. శేవధి - నిధి
  2. ధూర్వహుడు - బరువు మోయువాడు

________________________________________________________________________________

836

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1