Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/825

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గర్వింపగ దగినయట్టి
మహావ్యక్తులయిన మీరు
భట్ట సర్వభారతియ
సంవిత్తు[1]కు, సంస్కృతికిని
సంగమసుస్థానము గద!
ఇట్టి మీదు నానావిధ
శ్రమఫలితంగాను బాహి
రిల్లినట్టి కడ కృతులలో
ముఖ్యంగా హరికథలే
సకలజనుల ఆకర్షణ
గావిస్తూ, సత్కీర్తితో
యుగయుగాలు బ్రతికి ఉండె
"సంస్కృతి - భాండాగారం”
ఆంధ్ర విశ్వవిద్యాలయ
ఉపాధ్యక్షులయిన అప్ప
రాయ మహాశయుల అభి
ప్రాయ మిద్ది మిమ్ము గూర్చి

—♦♦♦♦§§♦♦♦♦—

38   శ్రీనారాయణదాసా!
శ్రీసుందరరామశాస్త్రి
మీ రెరిగిన విద్వాంసుడు,
మిమ్ము గూర్చి తెలిపె నిట్లు
"దాసుగారు వేద శాస్త్ర
పురాణేతిహాసాదుల
లోని సర్వసారజ్ఞులు
సంగీతము నందును, సా
హిత్య మందు, కవితలోన,
నృత్య వాద్యములలో అస
మాన ప్రజ్ఞాధురీణు
డును కళాప్రపూర్ణుండును.
ఇది అది అన నేల స
ర్వజ్ఞుండును, పరిపూర్ణుడు,
సర్వమందు స్వతంత్రుండు.
రూపరేఖ లందు సుంద
రుడు, శ్యామలగాత్రుండు
శారదాంశసంభవుండు
ఆంధ్రావని అవతరించి
నట్టి ఒక్క గంధర్వుడు”.

39   శ్రీనారాయణవర్య!
సకలకళాగుణధుర్య!!
వస్తున్నవి కథకచక్ర
వర్తుల్లో ఒక్కరుండు,
రామాయణమును తొలుతగ
ప్రజ కిచ్చిన మహనీయుడు
ప్రముఖ పత్రికారచయిత
శ్రీనివాస శిరోమణులు
మిమ్ము గూర్చి తెలిపినది
“దక్షిణాపథానను సం
గీతంలో అంతవాడు
ఇంతవరకు పుట్టలేదు.
త్యాగరాజు సంగీతం
లోన ప్రాథమికం గాను
సుగమముగను ఒనరించిన
కార్యమ్ముల నారాయణ
దాసుగారు అతిసమగ్ర
ముగను, సప్రమాణముగా
ప్రౌఢంగా ప్రదర్శించి
లోకానికి చూపినారు”

  1. సంవిత్తు = జ్ఞానము , సంకేతము , ఆచారము

________________________________________________________________________________

ఉపాయనలు

825