40. శ్రీనారాయణభట్టా!
మహాభట్ట! ఆదిభట్ట!!
రానున్నది ఆంధ్రజాతి
వైతాళికులలొ ప్రముఖులు
పుణ్యాత్ములు కడుపూజ్యులు
శ్రీమామిడిపూడివారు
మిమ్ముగూర్చి తెలిపినవి
“ఆంధ్రుల సంగీతకళా,
సాహిత్య వియన్మండలా[1]న్ని
ధగద్ధగిత మొనరించిన
ధ్రువతార[2] లు దాసుగారు
వారితోటి కొంచెముగనో
గొప్పగనో పరిచయమ్ము
కలిగినట్టి నన్ను వంటి
వార్కి వారి అందున 'కను
పించినట్టి ముఖ్యలక్ష
ణమ్ము వారి కున్న ఆత్మ
విశ్వాసము. ప్రపంచంలో
స్వయంకృషితో సాధింపం
గాజాలని విద్య ఎట్టి
దీ లేదను ధీమాతో
జీవన యాత్రను నడిపిరి.
ఈవిశ్వాసమువారికి
కుదరటాన్కి పోతన్న మ
హాకవీశునకు పాండి
త్యమ్ము వోలెవారిది సై
తమ్ము సహజ పాండిత్య
మ్మగుటయేను కారణమ్ము.
జన్మతః శక్తియు, సా
మర్థ్యమ్మును కలవారే
ప్రతిభావంతులు కాగల
రనుట వారి నమ్మకమ్ము.
దీని గూర్చి పదేపదిగ
వారు స్నేహితులతో ప్ర
స్తావిస్తూ ఉండేవారు.
గురుముఖాన ఏ విద్యయు
నేర్వలేదు వారు. అట్లు
నేర్చుకొనుట స్వీయప్రతి
భకు ఆటంకమును కలుగ
జేయు ననియు, అట్లు నేర్చు
కొన్నవారు ప్రాచదువుల[3]
బిక్కబట్టి గుడ్డియెద్దు
చేలలొబడు నట్లు ప్రవ
ర్తించువారు అనియు వారు
భావించిరి. మహీశూర
సంస్థానమునందు వారు
కర్ణాటక హిందుస్థాని
బాణీలను రెండింటి స
మన్వయించి నూత్న ఫక్కి
లోన శ్రోతలబ్బురపడ
సంగీతప్రదర్శనమ్ము
గావించిన సమయమ్మున
మహారాజువారు మహా
రాజ్ఞితోడ వారిగాన
మును పరమమ్మౌ శ్రద్ధతో
ఆలకించి "సంగీతము
మీ రెక్కడ నేర్చుకొంటి
రని అడిగితె" నా సంగీత
- ↑ వియన్మండలము = ఆకాశము
- ↑ ధ్రువతార = ఉత్తరదిక్కున ఉండు నక్షత్రము
- ↑ ప్రాచదువులు = ప్రాత + చదువులు - వేదములు
________________________________________________________________________________
826
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1