పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వాతంత్య్ర దినము




వచ్చె నిదె స్వాతంత్య్ర దినము
మరల నిం కొకమారు
వచ్చె మన స్వాతంత్య్ర దినము!!
పరదాస్యమును బాపి భారతీయుల కేను
పరమ స్వేచ్ఛావృత్త చరమసీమల కేగు
వెలుగు బాటల జూపి, తలపు లిచ్చితి - కాన
నను మరువబోకు డని తిరిగి తెల్విడిసేయ
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

అచ్చెరువు వడుచు నిదె మెచ్చుకొన మును తాను
జీవనమొందిన రీతి మనసులలో చిత్రించి
హెచ్చరికలను కాన్క లిచ్చి, యెద పుచ్చుకొని
తెరమరుగునకు నేగి మనల నడిపింపగాఁ
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...
                                    
తన అహింసాదివ్య దారుణాస్త్రమ్ముతో
కడిది శత్రుల ఆట కట్టించి, రాజ్యమును
పెట్టించె నిజప్రజకు - ప్రీతిమై 'జాతిపిత’
గాంధిదేవుని గొల్చి కైమోడ్పులందింప
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

రాక్షసోజ్వల శక్తి రణచణత్వము పెంచి
దీక్ష నీలోకము తెరలింప గనువేళ
పంచశీల సృజించి ప్రగతి వంకకు మలచి
ఏ జహ్వరిల చెలఁగె ఎన్న నామహనీయు
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

______________________________________________________________________________________

446

వావిలాల సోమయాజులు