పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిన్నుగని కనుకుట్టి యున్నయవి పెనుగొండ
లన్ని దారులలోన అదరకని బెదరకని
మన ప్రజాతంత్ర ఘన మహానౌక కొక
చిన్ని సలహా నొసగి - చేర్పగా తీరమును
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

ఆది చరితను మరువ కంధానుకరణమున
నీది యేదొ వెదకి, ఉన్మాదివై వలచి
తూర్పువాకిలి తెరచి, నేర్పుతో పడమటకు
తరలింపుమా నీదు ధర్మ రథమని తెలుప
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

ఋషివాటికల తొలుత తుషిత ప్రశాంతి యెది
యింపుగా పెంపొంద నిల స్వర్గమయ్యెనో
అది నేటి మానవున కమరునందాక ఇక
నిదురవోవకు మనుచు నిను ప్రబోధింపగా
వచ్చెనిదె స్వాతంత్య్ర దినము...

________________________________________________________________________________________

గేయ కవితలు

447