తే. ఉన్న మన ధర్మ మన్నది యుండవలయు
రావణుఁడు నరకాన ధర్మపురుషుఁడవు
నీవు దుఃఖమ్ము రామ! పొందెదనె, ఇట్టి
వైన వ్యతిరేక ఫలముల్ నిరర్థకములు.210
తే. ధర్మ పరుఁడైన వానికి ధర్మఫలిత
మైన సఖ్య మధర్మున కాఫలితము
నైన దుఃఖము చెందును అట్టి సమయ
మందు మానవుల్ ధర్మమార్గాళి విడరు.211
తే. వారికి నధర్మమును జేయవలయు ననెడి
కోర్కె కల్గదు ధర్మానుకూలరుచియె
కల్గి ధర్మమొనర్తురు గాఢధర్మ
ఫలము సౌఖ్యమ్మె వారికి ప్రాప్తమగును.212
తే. చెడుగు గావించువార లక్షీణ ధనులు
మంచి చేసెడివారు సుఖించలేని
వారగుట జల్గుచున్నది వారి గనిన
ధర్మము, నధర్మమును నవాస్తవము లౌను213
తే. దాని ఫలితమ్ము తోచక దాని రూపు
కనుల కగుపించకను నసద్దాఢ భూత
మైన ధర్మమ్ముతో సుఖాలందుకొనుట
యెట్లో మీరలు కడుగమనింపవలయు.214
తే. అర్థముఖ్యమ్ముగా వ్యవహరణ జేసి
యర్థ మభివృద్ధిఁ జేసెడి యట్టి పర్వ
తముల నదులయటులఁ గార్యతతి సమస్త
మందు నుండియె ప్రారంభమగును నిజము.215
తే. పురుషుఁ డెవ్వండు దూరుఁడై పొల్చు సర్ద
మునకు నాతని కార్యముల్ ముఖ్యముగను
నన్నియును గ్రీష్మ ఋతువటు, చిన్ని నదుల
పోలి నశియించు సత్యమై పొలుచునిద్ది.216
మధుప్రప
221