తే. వీరు లేనాఁడు జలశూన్య నీరదముల
వలె నధికము గర్జింపరు వ్యర్థముగను
కలహమున శత్రు నోటమి ఫలితముగను
నిచ్చు నా గర్జనమును వీక్షింపుమయ్య!203
తే. ఓ మహావీరులార! ఆయుధములు విడి
జీవితమునకు రక్షణఁ జేసికొనఁగ
మీరు పరువెత్తుచున్నారు మీదు సతులు
పరిహసింత్రుథె పెద్దలు వడయ నవ్వు.204
తే. వైరులకు నోడి, జగతి జీవించు వాని
నందరును భీరు వనుచు హాస్యమ్మొనర్రు
వీడి భయము సజ్జన మార్గ వివృతి ననుస
రింపఁగా వలె నాతఁడు పెంపు నొంద.205
తే. సృష్టి ధర్మప్రకారమ్ము చిన్ని ప్రాణ
ములము - యుద్ధ మందున ప్రాణములను వీడి
స్వల్పయోధులకెపుడు లభ్యమ్ము గాని
బ్రహ్మలోకమ్మునకు నేగవలయు మనము.206
తే. ఓయి వానరులార! ఈ యుద్ధమందు
వైరి నోడించి కీర్తినిఁ బడయవలయు
వీరరణమున మృతి నొంది, వీరలోక
సంపదను బొంది యనుభూతి సలుపవలయు.207
తే. తండ్రి మాటను నడిచితి ధర్మమార్గ
మందున - జితేంద్రియుండ వీ వరయధర్మ
మగును వ్యర్ధము - పూజ్యుఁడా! అఖిల కష్ట
ములకు నిను దూరుఁ గావింపఁగలుగ కున్న.208
తే. జగము నందలి స్థావర జంగమమ్ము
లయ్యు భూతముల్ కన్పించు నన్ని కాని
ధర్మము కనఁబడని దౌట ధర్మమెటను
లేదనునది నా భావ మీ రీతి నిజము.209
220
వావిలాల సోమయాజులు సాహిత్యం-1