Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


    వలయుకాలాన చేయఁగా వలయువీని
    కాక నెపుడును కామమ్ము కడగి కొనఁగ
    రాజు నశియించుఁబరమ నిర్వ్యాజముగను.196

తే. పురుష రూపులు, కడు పశుబుద్ధులైన
    వారు కొందఱు శాస్త్రాలు వారు చదువ
    రయిన మంత్రి పదవులను నాక్రమించి
    పలుకుచుంద్రు ప్రగల్భముల్ ప్రబలముగను.197

తే. హితము కానట్టి దానిని హితము కాగఁ
    జూపఁజూతురు గొప్పలఁ జూపు కొనుచు
    అట్టి కార్యదూషకుల మహార్ణ చింత
    నల సమయముల దరిఁ జేర్పఁదలఁచరాదు.198

తే. తెలివిగల శత్రువులతోడఁ గలసి సచివు
    లయిన కొందఱు వైరివరాశలకు
    లొంగి ప్రభుని నాశన మొనర్పంగ దారి
    తీయు పనులఁ జేయింతు రతీతముగను,199

తే. ఎవడు వైరినిఁ దనకంటే హీనునిగను
    భావనయొనర్చి, యవసరపడదగిన
    రక్షణను పొందఁడో యాధరాధినాథుఁ
    డొందు కష్టాలు, స్థానమ్ము నురలిపోవు.200

తే. వర్తమానమ్ము ముఖ్యము, ప్రబలమగుట
    చేయవలసిన దాని యోజింపవలయు
    గతము గూర్చి యోజింపఁగాఁ గడఁగ రాదు
    అవసరము లేదు గతమగు గతము - కాదె.201

తే. జీవమనుమాన నిలయమై చెలఁగు నపుడు
    ఎట్టి బలహీనుడును వైరి నెదియు సహజ
    మానవునిగా భావన చేసి వాని వశము
    చేసికొనుటకు యత్నమ్ము చేయరాదు.202


మధుప్రప

219