Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. సైనికోద్యోగి కన్యదేశముల యందుఁ
    దరచు సక్రమ పత్నియై వరలు వేశ్య
    అతడి పత్ని పతివ్రత యయ్యె నేని
    విరహిణీ గోపిగా మారు విష్ణుభక్తి.

తే. రాజవైద్యుల జీవిత లక్షణముల
    విశదముగఁ దెల్పుటన నవివేక మెపుడు
    నమ్ము, తొలగించునవ్వారి నాలుకలను
    ప్రభువు రాణుల బ్రతుకును గుప్తమొనర.

తే. దున్న దగినట్టి భూమియే దుహిత, నన్నుఁ
    బిలిచితివి గాన నడుగఁగా వలచినాను
    ఇచ్చితివొ నాకు మీ విద్య నచ్చ నేర్పి,
    ధనికు నీ కల్లుఁ గావించి, తనియఁజేతు.

తే. నన్ను దోచిన ప్రియుఁడవై యున్న నేమి?
    నాస్తికత గాఢముగ నెద నమ్మి నీవు
    కలిసి తిరుగు నా చెల్లి యొక్కతెతొఁ దప్ప
    నెవరితో నైన వాదించుటే నెఱుంగ.

తే. తరుణులకుఁ 'బ్రతిదాన' నర్థమ్ము గలదు
    'ఏను చతురంగ కేళి నోడింతు నిన్ను
     అనియె యౌవని అర్థమ్ము నరసి మదిని
    'అద్ది నాకు నదృష్ట' మం చనియె నతఁడు.

తే. అంతగా ననౌదార్యుండ వగుచు నన్ను
    నీ వెదుర్కొందు వేని నే నిన్ను నిలిపి
    యాపఁగా శక్తి గలదాన నౌట సున్న
    అగుము పితవు, ప్రియుండ వియ్యటయందు. 12

తే. 'భర్త కడనుండి కొనిపోవఁ బాడియేమి
     నీకుఁ గల"దని ధార్మికుల్ నిలిపి, యడుగ
    "పడయు దనురాగమును నేనె పాడిగాదె,
     విబుధవరులార! విడుఁడని విన్నవించు.”


158

వావిలాల సోమయాజులు సాహిత్యం-1