Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. "దుర్గమును నేను రాజన్య దుహిత నగుట
     దండయాత్రల నెన్నియో తట్టుకొంటి
     సత్యముగఁ బెండ్లి ప్రేమ శ్మశాన మరియ
     కాన, వరుఁడ కొన్నాళు లాగంగవలయు.

తే. "నన్ను బసివిని గావించినాఁడు నాన్న
     భక్తిఁ గొల్తుఁ జరల్లింగ బసవలింగ!!
     ఇత్తు సంతృప్తి నను వస్త్రహీనఁ జేసి
     కొమ్ము బహురూపములను భోగమ్ము, రమ్ము.”

తే. ఏడుగురు భర్తలను జంపె నెవతె, ఆమె
    పాలనము సేయఁగల దేక పాలనముగ
    క్రొత్త మిండఁడు గని కన్నుఁ గొట్టినంత
    ప్రాత మిండనిఁ దొలఁగింప భయము వడునె.

తే. "ఓసి పుష్పమ్మ, నిన్ను నే నుత్సుకమున
    నెదను జేర్చితి! మధుర మీ యుదయవేళ,
    కంటకము సోకె సూర్యనిర్గమనమయ్యె
    నీవు వాడితి వీరతి నిలిచె బాధ!"

తే. "ఆడవేషాల వేయు మర్యాదఁ జూపు
టందు ఘనమైన సంతోషమగును నాకు
ఒక మహారాజ్ఞి వేషమ్ము నొనరఁ దాల్చి
నపుడు చూచెడి రాజ్ఞు
"లో అక్క' అనిరి (నన్ను)”. 18

తే. "ఆడువేషాల వలపించు నపుడు బావ
     ముద్దులతో, చూపులతొ నెంతో మురిసిపోయి
     యన్నమును దిన మరచిన యంత రాత్రి
     'మక్క తిట్లతో, కొట్లతో నలసినాము.”

తే. "ఉత్తమునిఁ బెండ్లియాడిన యువిదకంటె
     నెవనిఁ బెండ్లాడి భార్యయౌ నతనిఁ నెఱిఁగి


1 తిట్లు భర్తవి, కొట్లు చెల్లెలివి.


మధుప్రప

159