Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'అనామిక '


తే. కూర్మి సంతోషపెట్టఁ బూన్కొనియొ యేమొ
   యెవతె తన భర్త కూరిలో నితర వనిత
   లెల్లరను బవిత్రలను గావింప లేదొ
   యట్టి స్త్రీ చేయుఁబతిని నాహ్లాదరహితు.

తే. శుభ్ర 'శయ్య'ను విడని వస్తువులు కనఁగఁ
    కొన్ని మాత్రమె యున్నవి ఎన్నో లేవు
    అందు స్త్రీత్వమ్ము విడువని యబల యొకతె,
    ఆమె తన 'శయ్య'తో భర్త నాదరించు.

తే. భర్తయే దైవమని నమ్మి ప్రబలభక్తి
    వర్తన మొనర్చు సతి - మానభంగమునకు
    గురియగుట కనియును, నామెఁ గూర్చి 'దుష్ట'
    పతిత యని పల్కుటది మహా పాపకర్మ!

తే. రమ్యతకుఁ బ్రతిక్రియ మనోతౌల్య మౌట
    స్త్రీ పురుష శక్తు లుభయముల్ చేరుకొనిన
    నందగత్తియ, సౌజన్యయైన పడతి
    యీ జగమ్మున స్వాదు సమాజ మౌను.

తే. కామచారమ్ము స్త్రీ జనప్రేమ కాన
    భవ్యవనమటు నిరతమ్ము నవ్యమగుచు (నవ్యుఁడగుచు)
    నుండఁగా వలె, లేకున్న నుండఁగలఁడె
    భర్త యెంతటి పాలనా ప్రౌఢుఁడయిన?

తే. వరల నెవ్వేళ శుద్ధాంత వైద్య వరుల
    తో రహస్యాలు రాణులు కోరుకొంద్రు
    వారి ప్రియులను జేర్తురు వారె వారి
    భవనముల షండ వైద్య సేవకుల భంగి. (పగిది) 6


మధుప్రప

157