తే. గేదె బుజమున వ్రేలుచు, మీద కొమ్ము
చేతఁ గొట్టఁబడుచు మ్రోగఁ జేయబడిన
వీణ కడనుండి యేతెంచు వెర్రిధ్వనిగ
సిమసిమల దోమలగుంపు చెలగు చుండె
తే. ఆతఁడుకులీఁను డది యొప్ప దంగమటుల
రెండు మోములు గలవాడు, నిండి మోము
నందు నుండ నన్నము పల్కియందముగను,
వీడ నీచ భాషణసేయు విరసముగను.
తే. పటహమును బూని వాయించి భర్త నీదు
దౌష్ట్యతను జాటుచుండగాఁ గష్టపడక
సిగ్గు పడకను నృత్యమ్ము సేయునటుల
వేయుచున్నావు గమకముల్ వెలఁది నీవు!
తే. అతఁడు నేఁడె స్థలాంతర మరిగినాఁడు
అందువలన నా వీథిలో నాదియందు
నున్న దేవాలయ ప్రాంగణోన్నతములు
మా మనస్సులు శూన్యమ్ము లేమి తెలుప. 68
తే. ఓయి, నే తెల్పునటుగాక ఊరకీవు
ఆడుచున్నావు గానగ నహరహమ్ము
బెల్లమునకై అరసికూడ బెల్లమైన
లేకరసము కాదనియఁగ లేదె నీవు.
తే. చక్కకా కాళ్లు పిసుగుట, చాలశక్తి
కలిగియున్నట్లు నా హస్తములకు నేమొ
చేర్చె లాక్షా మహారాగ చిత్రణమ్ము
ఆమె పాదాలు.... 70
156
వావిలాల సోమయాజులు సాహిత్యం-1