'అవతరణ '
ఉ. ఏనొక కిన్నరీప్రియుడ! నేవసియించితి మున్ను నందనా
నూనరసాల శాఖిక శుభోజ్జ్వల గాయకమూర్తి నౌచుదే
వీ నయనారవింద రుచులే మహనీయ రసప్రపంచ యా
త్రానవమార్గ దర్పణములై కరదీపికలై చెలంగగన్.
ఉ. నా యెదలో జనించిన అనన్యానుభోగ్య మనోజ్ఞ భావపా
థేయముతో చరించితిని తృప్తి వహింపక - గీతికారనో
చ్ఛాయము నా విపంచిక గళమ్మున జీర యొకింత రాదు ది
న్యాయత మత్ప్రియా సురుచిరాక్షుల మ్లానత తోప దెన్నడున్.
ఉ. ఆ రమణీయ పుష్పవని కాటలనేర్పి సుభంగభంగ భా
గీరథికిన్ తరంగపటకీలనమున్ సవరింపనేర్పి - శం
పారమ కేను విష్ణుపదమందిరవీథి నటింప నొజ్జనై
ఈ రసయాత్రలో గడచె నెన్ని వసంతములో దినమ్ములై.
చ. ఎరుగరు మారహః ప్రణయమెవ్వరు మిత్రులు మద్విపంచియున్
కరమనురక్తి ప్రేమకథగా నయినన్ వచియింపలేదు కి
న్నరులకు నెంతనేస్తమయినన్ - సకలమ్మొకస్వప్నగాథగా
జరిగెను నా 'రసప్రియ'కు జల్పితమంజుల కావ్యవస్తు వై. 4
'(ఆశాజ్యోతి)'
మధుప్రప
145