ఈ పుట ఆమోదించబడ్డది
శా. కాకల్ దీరిన కర్ణధారు లిదె చుక్కానిన్ కరంబందునన్
వీకం దాల్చిరి - రాజ్యనౌక సకలోర్వీ కీర్తికిం బాత్రపు
ఆకాంక్షా పరిపూర్తి నీ కొసంగ సర్వార్థంబునన్ సాగు నే
డే కల్లోలము లే మహా జలధులం దెన్నెన్ని జృంభించినన్.
ఉ. యుద్ధము పైన యుద్ధము, మహోన్నతమౌ సహజీవనమ్ములో
కోద్ధరణమ్ము కై అసువులొడ్డుట, శాంతి కలీన రీతికిన్
బద్ధమొనర్చి - జీవితము - పావన నీతిఁ జరింపు మయ్యనీ
విద్దర లక్ష్య సిద్ధి గన నేగురి తప్పని రామబాణమై. 8
'(AIR 26.1.66)'
134
వావిలాల సోమయాజులు సాహిత్యం-1