ఉ. ఎంత అదృష్టవంతులు కదా యిటు పొంగెడు నిన్ తరిం
కాంతమునన్ త్రపన్ సఖుల కౌగిలిలో నిదురించు జాణలే
నంతకు నోచలేదు కఠి నాయుతమైన నితంబ వృద్ధి న
త్యంతము నాపయిన్ కరుణ నవ్వల జేర్పు తరంగ డోలలన్.
మ. చిరుప్రాయంబుననైన సెజ్జపయినే చేరన్ సఖీ! యొంటి సో
దరుడాతండు వియోగ వహ్నికృత బాధన్ తాళగా లేడు - ఈ
తరుణం బయ్యెడు దాక వేచిచను నాతండింక రానంచునీ
చిరదాంపత్యము కల్గునే జలధితో చెల్వున్ ననున్ జేర్చినన్.
మ. ఉరుముల్ పెల్లగు, ద్రోణ వృష్టి కురియన్ యుద్వేలమై వచ్చిన
కరిగాంభీర్య పయోనిధిన్ గనుము - నాగాత్రం బిదే యిందుది
తరువై ఈ చలిగాలిసోక, మీదనార్తన్ పాతకం బౌను స
త్కరుణామూర్తి వటంచు నేయేడ యశోగాథాళి కీర్తించెదన్.
శా. ఏదో ఓపగరాని వేదనను నిన్నే దూరితిన్ నీవు మ
ర్యాదన్ తప్పెడు దాచవే - జలధి సౌహార్ధంబు నీ కబ్బవౌ
రాదివ్యాపన - మాకు దేవతవు నీవు కావే - నీ గాధలే
కాదా మారతివేళ కల్గెడు ప్రసంగంబుల్ సముద్రప్రియా! 10
'సాహితీ సమితి రజతోత్సవ సంచిక '
132
వావిలాల సోమయాజులు సాహిత్యం-1