'ప్రియోత్కంఠ '
ఉ. ఆ కరణిన్ నిదాఘ దివసాంతము కల్గెడు దాత వేకర
త్నాకర సంగమంబు నెలతా, వసివాడి కృశించి నావు -కా
నీ కడచున్న యాదినము నేటికి జ్ఞప్తికి వచ్చు నీకు నే
డీ కరణిన్ ప్రియావిరహమెంత తపింపగ మిన్ను వ్రాలదే.
ఉ. క్రీడగ నిన్ను జూసి కనుగీటిన తోయద రాజుమింట నీ
"వ్రీడము తోడ బాహులుప గూహనకై పరువెత్తనేల? నీ
వేడ? క్షణప్రభాదయితుడేడ? మహార్తి చరింపనేల? ని
స్గూడగ నెంచునే? వలపు కోర్కెల పాంశులవయ్యె దేటికే?
ఉ. నీవు కృశించి గ్రీష్మమున నీరవ శుష్క గళమ్ముతోడ నో
సీ! విలపించు వేళలను శీర్షముపై పదముంచి దాటి నా
నే - విధు శూన్యమైన రజనీఘన నీపతమిస్రలందు ప్రే
మావిలమూర్తి నా ప్రియు భుజాంతర పంజరకీర మౌటకున్.
శా. ఈనాడో భయమౌను నిర్థారణి నీహేలావిలాసంబుగ
ర్జా నిర్ఘొషము కన్నవిన్న - ఇటు గర్వస్ఫూర్తి యెన్నాళ్ళో దే
వానైదాఘ దినమ్ము లింక - అపుడేమై పోదునో. చూచుకో
నీ నీర ద్రవిణంబు శాశ్వతమటే నిర్ణీతివైవర్తిలన్.
ఉ. ఏమని ఏగుచుంటి సుదతీ! ఒడలెల్లను కాళ్ళుగాన, వీ
చే మృదులాంశుకమ్ము కటిసీమను నిల్వక జారిపోవ, నీ
వా మదనాభిరాముడగు నంబుధిరాజునకై మనోజ్ఞవై
నేమును నట్టివారమె సుమా! ఇది న్యాయమె సోదరీమణీ ?
శా. ఈ నీ పొంగులె కాని ఆజలధి రాజేమో మహాహ్లాదినీ
లీనా లీన సమాగమంబునకు కేళీవృత్త చిత్తుండు ని
న్నేనాడైనను చేర్చె నీ యొడిని - ఏమే యెందుకో పొంగులో
సీ! నీ దాస్యమునైన నీకొరుగదే సిగ్గేల లేదే సఖీ? 6
మధుప్రప
131