Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ఆమె నుత్ఫుల్లిక క్రీడ నాడునట్లు
    ఆడగా నిమ్ము జఘన భారాన్వితగుట
    అంత సులభమ్ముగా లొంగనట్టిదగుట
    కలుగదలచుట ఆమె కేకాలమందు.

తే. దేవలుడు నవలతికతో తెరవనప్పు
    డెచ్చటెచ్చట తాకునో అచ్చటచట
    ఆమె దేహాన రోమాంచ మతిశయించి
    కల్గుచున్నది - అద్దాని చూచినాను.

తే. అగ్నివర్ణుల మాహాత్మ్య మాచరింప
    స్వర్ణమేఖల భవదీయ జఘన మెక్కు
    టాదిగాగల సౌఖ్యాల ననుభవించె
    అది ఇతరుడికి నెపుడు లభ్యమ్ము కాదు.

తే. ఫాల్గుణోత్సవ కాలాన పాపమడుల
    తలపబడకుంట నిప్పు డో నెలఁత బురద
    నెవడొ నీపైన చల్లెను ఏల పరుగు
    వారెదవు? మోమున, చనుల, కార చెమట.

తే. విప్పినాడు ప్రియుడు నీ కొప్పుముడిని
    నోటను మధువు వాసనలూరుచుండె
    సర్వమియ్యది మన్మథోత్సవమునందు
    అగును నా బాస మిక్కిలి అధికముగను. 18

తే. ముష్టినిండుగ నొక రంగు ముగ్గు తీసి
    ప్రియునిపై జల్లుదనుచు భావించె నెవతె
    ఆమె అతనిఁ జూడఁగా నద్దియయ్యె
    ముమ్మరమ్మగు గంధోదకమ్ము కరణి.

తే. వివసన గతిని గిరిజ గావింపబడగ
    ఆమె సొగసుగ అక్షిద్వయమ్ము మూసి
    కర కిసలయాల పరిచుంబ గ్రహణకేళి
    మూయు - నళినాక్షి విజయమ్ము పొందుగాక!


మధుప్రప

121