తే. మచ్చలేనట్టి చంద్రబింబమ్ము సూర్య
బింబమును జేరి మిగుల శోభించునట్లు
వక్షమున నున్న ఘనకౌస్తుభమ్ము నందు
లచ్చి మోమున్న విష్ణుని మెచ్చి కొలుతు.
తే. అంటుకొన పిండి తెల్లగా నొంటినిండ
కర్షకుని పుత్రి పథికులు గాంచు చుండ్రి
క్షీరసంద్రమ్మునుండి పై జేరి లచ్చి
దేవతలు చూచునటుల సంతృప్తి తోడ.
తే. పరమ రతి గేహమున నున్న పంజరమ్ము
లోని శుకమును తొలగింప బూనవేల
అత్త, ఇంకొక చోటికి? అది రహస్య
వచనముల చాటుచుండె ప్రపంచమునకు.
తే. వర్ణములు లేక గీతలవలన చిత్రి
తమయి ఉన్న పటముననె తనదుప్రియను
ప్రియుడు క్షణకాల మేనియు విడువలేక
యున్నవాఁడెంత చిత్రమో యూహ చేయ.
తే. ఆమె ఆనవాలు మరచి, అచట పాతి
పెట్టి మరచిన వానిగా వెదుకుచున్న
దట్టి ఆ వెదురు పొదల యందు నిన్ను
అడుగడుగునను నదె మహార్తి తోడ.
తే. నీవు కనుపింతు వంచును నిర్దయుండ
ఆశతోడ నింటింట వాయనము లెల్ల
లెక్కపెట్టుచు నిచ్చు చాలేమ అదిగొ
తిరుగుచున్నది ఎంతయో తీరికగను. 12
తే. గంతులేయుచు పరుగెత్త గలుగు జనుల
యమిత కలకలనాదాన (నొప్పి) అధిక ఘోష
లొసగు తూర్యాలనొప్ప నీయుత్సవమ్ము
అతడు లేకుంట గ్రామ దాహమ్ము బోలె.
120
వావిలాల సోమయాజులు సాహిత్యం-1