పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

తి. తి. దే. “శ్వేత" సంస్థలోని. “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు" ఈ కవయిత్రి యొక్క తదితర రచనలను - శ్రీ భాగవతము (ద్విపద), శివనాటకము (యక్షగానము) - మున్నగు వాటి నన్నిటినీ అతి త్వరలో ప్రచురించే ప్రణాళికను సిద్ధపరుస్తున్న దని తెలియజేటానికి సంతోషిస్తున్నాను.

ఈ ప్రచురణలతోపాటు, ఆంధ్రావనిలో గల ఆ యా పట్టణాల్లో సాహిత్య సదస్సులు, సంగీత ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు - మొదలయిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటంద్వారా ఈ మహాకవయిత్రి సారస్వతం యొక్క ప్రశస్తిని ప్రబోధించే ఉద్యమాన్ని తి. తి. దే. ఈ వాఙ్మయ ప్రాజెక్టు ద్వారా కొనసాగిస్తూవున్న దని తెలుపటానికి మిగుల ఆనందిస్తున్నాను.

శ్రీ. కె. జె. కృష్ణమూర్తిగారు సుప్రసిద్ధ పరిశోధకులు. ఎంతో ఓర్పు, నేర్పు ప్రదర్శించి ఈ కృతిని పరిష్కరించినందున వారిని మనస్స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

భూమన్