పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ix వీలిక కావ్య ప్రశస్తి: భారతీయ ఆధ్యాత్మిక పొట్మయంలో కిరీట సదృశమైనది 'వాసిష్ఠ రామాయణము'. ఈ మహాకావ్యానికి జ్ఞానవాసిష్ఠము', 'యోగవాసిష్ఠము', 'మహారామాయణము', 'అఖండ రామాయణము . 'ఉత్తర రామాయణము', 'వసిష్ఠగీత' ఇత్యాది అనేక నామధేయాలు కాలక్రమేణ ఏర్పడినాయి. ఈ పేర్లన్నీ ఈ తాత్త్విక గ్రంథానికి గల ప్రశస్తి, ప్రచారాలను చెప్పక చెపుతూవున్నాయి. దాదాపు ముప్పది రెండువేల శ్లోకాల పరిమితి గల ఈ బృహతీ కావ్యం i) వైరాగ్య ప్రకరణం ii) ముముక్షు వ్యవహార ప్రకరణం iii) ఉత్పత్తి ప్రకరణం iv) స్థితి ప్రకరణం ఆ) ఉపశమప్రకరణం vi} నిర్వాణ ప్రకరణం - అనే ఆరు ప్రకరణాలుగా వింగడింపబడివుంది. అద్వైత వేదాంతాన్ని ప్రబోధించే ప్రాచీన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రముఖమైనది. వాల్మీకి మహాకవి శ్రీమద్రామాయణ రచన పూర్తిచేసిన షిమ్మట కొంతకాలానికి ఈ వాసిష్ఠ రామాయణాన్ని రచించినట్లు అనూచానంగా తెలియవస్తున్న అంశం, విశ్వామిత్రుడు యాగ సంరక్షణ నిమిత్తంగా శ్రీరామచంద్రుణ్ణి వెంట తోడ్కొని వెళ్లటానికై అయోధ్యకు విచ్చేసిన సందర్భంలో, వసిష్ఠునిచే శ్రీరామునకు ఉపదేశింపబడినదయినందువల్ల, కథాశ్రమంలో ఇది ముందు జరిగినది; శ్రీమద్రామాయణమునందలి కథ దీనికి తరువాత జరిగినది. అయినప్పటికీ, శ్రీమద్రామాయణము ముఖ్యంగా కర్మయోగాన్ని, ఈ వాసిష్ఠ రామాయణము జ్ఞానయోగాన్నీ ప్రపంచిస్తూ పున్నందువలన, అది పూర్వరామాయణంగానూ, ఇది ఉత్తర రామాయణంగానూ ప్రసిద్ధి పొందాయి. పోసిష్ఠ రామాయణం భక్తులకు భాగవతంలాగా, కర్మ యోగులకు భగవద్గీతలాగా, జ్ఞానమార్గ అనుయాయులైన వారికి ఆరాధ్యమైన పారాయణ గ్రంథం. ఇందులో కర్మయోగ, జ్ఞానయోగాలు రెండూ రసవత్తరములయిన ఉపాఖ్యాసాల ద్వారా, దృష్టాంతాల ద్వారా కావ్యశైలిలో సోపాసక్రమంలో విశదీకరింపబడివున్నాయి.