పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

X ఈ బృహద్ గ్రంథానికి భగవద్గీతతో కొన్ని పోలికలు, గోచరిస్తున్నాయి. 'గీత' భారతకథా సంబంధికాగా, 'వాసిష్ఠము రామాయణ కథానంబంధియైనది. శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించిన అనంతరం అర్జునుడు కర్తవ్యోన్ముఖు డైనట్లే, ఇందులో వసిష్ఠుని ఉపదేశానంతరం శ్రీరాముడు కర్తవ్యపరాయణుడైనాడు. గీత సర్వోపనిషత్తుల సారమయినట్లే, వాసిష్ఠ రామాయణము అనే కోపనిషత్తుల ఆకరమై వెలసింది!! ఈ విధంగా ఈ వేదాంతకావ్యానికి సారస్వత జగత్తులో నెలకొనియున్న విశిష్టతను గుర్తించిన గౌడ అభినందుడనే కాశ్మీర పండితుడు (క్రీ.శ.9వ శతాబ్ది) బృహద యోగవాసిష్ఠ రామాయణ కావ్యాన్ని 'లమయోగవాసిష్ఠ' మనే పేరిట దాదాపు ఆరువేల శ్లోకాల్లో సంగ్రహీకరించాడు. ఈ సంగ్రహ గ్రంథం మూలగ్రంథం యొక్క సారాన్నీ, తత సందేశాన్ని లోకానికి అందిస్తూ, అన్ని విధాలా ఆ బృహడ్ గ్రంథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ సందర్భంలో ఈ తాత్వికకావ్యం యొక్క ప్రశస్తిని వేనోళ్ల ఎలుగెత్తి చాటుతూవున్న ఈ క్రింది ఆంగ్లవాక్యాలు - సుప్రసిద్ధ తత్త్వవేత్త, మహాజానియయిన స్వామి రామతీర్థ (క్రీ.శ. 1873-1906) చక్కాణించినటువంటిది - ఈ సందర్భంలో పరికింపదగివున్నాయి: “One of the greatest books, the most | yonderful according to me ever written under the Sun is Yoga Vasishtha which nobody on Earth can read without attaring God - consciousness, nobody can read it without becoming one with All." ఈ మహోత్తమ కావ్యప్రశస్తిని గూర్చి వసిష్ఠ మహర్షి ఇందులో ఒకచో ఇలా వక్కాణించి యున్నాడు. 1. vide: The Philosophy of the Yoga Vasishtha, B.L. Atreya, p.26. The Theological Publishing House, Adyar, Madras (1936). 2.చూ. 'యోగ వాసిష్ఠ ఔర్ ఉస్కే సిద్ధాంత,పుట 9, తారా ప్రింటింగ్ వర్క్, బెనారస్ (1957). 1. చూ. 'వసిష్ఠ గీత (అను}, శ్రీ విద్యాప్రకాశావందగిరి స్వాములవారు, ఉపోద్ఘాతము, పుట14, 1వతూర్పు (1972).