పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xi “యదిహాస్తీ తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచితం ఇమం సమస్త విజ్ఞాన శాస్త్ర కోశం విదుర్బుధా:"" 'ఈ పోసిష్ఠ రామాయణంలో ఏది వుందో, అదే యితర శాస్త్రాల్లోనూ ఉంది. ఇందులో ఏదిలేదో అది తదితర శాస్త్రాలలోనూ లేదు. పండితులు ఈ వానిష్టాన్ని నమస్త విజ్ఞానశాస్త్రాలకు కోశం - అని అంటారు' రెండు అనువాదాలు: ఆర్ష వాజ్మయంలో ఇంతటి ప్రఖ్యాతిని వడసిన ఈ పురాతన గ్రంథానికి పూర్వాంధ్ర సారస్వతంలో రెండే రెండు అనువాదాలు వెలువడివుండటం విచిత్రంగా గోచరిస్తూవున్నా, యథార్థమయిన సంగతి! ఆ రెండు ఆనువాదాల్లో మొదటిది క్రీ.శ. 14 - 15 శతాబ్బుల నడుమ (క్రీ.శ. 1375-1435) నివసించిన మడికి సింగనామాత్యుని పద్యానువాదం. ఇది అయిదాశ్వాసాల్లో సంగ్రహంగా రచింపబడింది. సింగన ఆంద్రీకరణకు మూలం అభినందపండితుని 'లఘుయోగవాసిష్ఠమే నని పరిశీలన వలన వెల్లడయ్యింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి ప్రకృత కావ్యం రెండవ అనువాదం. పింగనవలెనే వెంగమాంబ కూడా లముయోగ వాసిషాన్నే స్వీకరించియున్నట్లు కావ్యారంభంలోని ఈ క్రింది ద్విపదలు వెల్లడిస్తున్నాయి. "ధరణి మీఁద మదాత్మ - తరియించుకొఱకు సామోదమతిని సు-జ్ఞాన వాసిష్ఠ రామాయణార్థసా-రమును గ్రహించి, 4. చూ వాసిష్ఠమహారామాయణము (వచనము). శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, 'ముందు మాట' - స్వామినిర్యాస్వరూపానందగిరి, రెండవ ముద్రణ (2000), శ్రీ శుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి,