పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరుసగా ద్విపద కావ్యముగా రచించి, యత లేక మీకు స-మర్పింతు నిపుడు, శ్రీ తారకోల్లాస! - శ్రీ శ్రీనివాస! శ్రీ తరిగొండ నృ-సింహ ధూతాంహ!" -వాసిష్ఠ రామాయణము, 1 పుట. పై పంక్తులలోని “మజ్ఞాన వాసిష్ఠ రామాయణార్థ సారమును గ్రహించి " - అనే వాక్యంలో కవయిత్రి తాను స్వీకరించిన మూలగ్రంథాన్ని సూచించింది. ఇంతేగాక, ఈ ద్విపదకావ్యం అంతా ఈ అంశాన్ని స్పష్టంగా నిరూపిస్తూవుంది. వెంగమాంబ కథా సంవిధానం: సింగనార్యుడి పద్యకావ్యానికి, వేలగమాంబ ద్విపద కావ్యానికి సంస్కృత మూలం ఒకటే అయినప్పటికీ, అనువాద విషయంలో ఈ యిరువురి రచనా విధానాలు వేర్వేరుగా గోచరిస్తూవున్నాయి. సంస్కృతమూలంలోని మొత్తం ఆరు ప్రకరణాలను వెంగమాంబ ఐదు ప్రకరణాలుగా ఇమిడించి తెనిగించింది. ఈ ద్విపద కావ్యమందలి కథాసంవిధానంలో కవయిత్రి ప్రదర్శించిన స్వతంత్ర దృక్పథానికి, రచనా ప్రణాళికకు ఈ దిగువ ఉదాహరించిన పట్టిక ఒక నిదర్శనం: వంస్కృత మూలం వెంగమాంబ రచన i) వైరాగ్య ప్రకరణము మొదటి రెండు ప్రకరణాల్లోని కథ మిగుల సంక్షేపింపబడింది. మూడవ ii) ముముక్షువ్యవహార దైన ఉత్పత్తి ప్రకరణం'లోని ఉపా ప్రకరణము ఖ్యానాలు దీనికి జోడింపబడినాయి. iii) ఉత్పత్తి ప్రకరణము ఈ విధంగా రూపొందిన తొలి మూడు ప్రకరణాల సమష్టి కథా స్వరూపానికి "ఆది ప్రకరణము" అని పేరు పెట్టబడింది.