పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

XH iv) స్థితి ప్రకరణము .... ఈ ప్రకరణంలోని ఉపాఖ్యానా లన్నీ ఇందులో "ద్వితీయ ప్రకరణము"గా రూపొందినాయి. v} ఉపశమ ప్రకరణము.. ఈ ప్రకరణంలోని కథ లన్నీ "తృతీయ ప్రకరణము"గా నెలకొన్నాయి. vi) నిర్వాణ ప్రకరణము..... కవయిత్రి యీ ప్రకరణాన్ని తెనుగున రెండు {నాలుగవ, ఐదవ ప్రకరణాలుగా దిద్దితీర్చినది. ఇలాగ విస్తరింప చేయటంలో ఆ ప్రకరణానికి గల ప్రాముఖ్యాన్ని లోకానికి సూచించటమే ఈ రచయిత్రి యొక్క ముఖ్యోద్దేశంగా భావించాలి. ఈ సందర్భంలో సంస్కృతమూల గ్రంథానికి సంబంధించిన ఒక విశేషం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావింపదగివుంది. వాల్మీకి రచించిన బృహద్ వాసిష్ఠ రామాయణంలో ఆరవదైన నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ఉత్తరార్ధం - అని రెండు భాగాలుగా ఉంది. వాల్మీకి రచనను సంక్షేపించిన అభినంద పండితుడు ఏ కోరణంచేతనో నిర్వాణ ప్రకరణం యొక్క ఉత్తరార్ధాన్ని స్వీకరింపలేదు. ఇందువల్లే 'లము యోగవాసిష్ఠ' కావ్యం నిర్వాణ ప్రకరణం పూర్వభాగంతోనే పరిసమాప్తి పొందివుంది. ఇందులో పూర్వోత్తర భాగాల ప్రసక్తి లేకపోవటం గమనింపదగ్గ అంశం! ఈ సంగ్రహకావ్యాన్ని ఆధారం చేసికొని ఆ యా ప్రాంతీయ భాషల్లో వెలువడిన అనేక అనువాదాలలాగే, మడికి సింగన, తరిగొండ వెంగమాంబ రచించిన పోసిష్ఠ రామాయణాలు రెండూ పూర్వోత్తరభాగాల ప్రస్తావన (ప్రసక్తి) లేకుండానే కేవలం పూర్వభాగ కథలతోనే పూర్తిగావింపబడివున్నాయి. కథాస్వరూపం: పూర్వం భరద్వాజుడనే మునిపుంగవుడు మోక్షకాంక్ష మనస్సులో తీవ్రతరం కాగా, గురువర్యుడయిన వాల్మీకి మహర్షి సన్నిధికి వెళ్లి, ఆయన పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామం కావించి, పరమభక్తితో ఇలా ప్రార్థించాడు. "ఓ మహామునీంద్రా! మీరు వేదశాస్త్రాది సద్విద్యలను ఏమాత్రం అరమర లేకుండా ప్రసాదించారు. ఆ రీతిగా పన్ను ఉత్తమ