పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యావంతుణ్ణి గా ఉద్ధరించారు. అలాగే, మానవులు సంసారమనే మాయాసాగరాన్ని దాటి, పవిత్రమైన ముక్తిని పొందే మార్గాన్ని అనుగ్రహించండి!'. అనగా విని వాల్మీకి ఇలా పలికినాడు: 'నాయనా! భరద్వాజా! లోకు లందరినీ ఉద్ధరించే ఉత్తమమైన ఉద్దేశంతో అతిరహస్యమైన ప్రశ్న అడిగినావు. లోకమంతటికీ మేలు కలిగించే చక్కటి మార్గాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధగా వినవలసినది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఐహిక భోగాలను నిరసించి, తగిన గురు ఆశ్రయించి, శ్రద్ధతో సేవించి ముక్తిని పొందవచ్చు. ఆ విధంగా సద్గురు వర్యుణో ఆశ్రయించి జీవన్ముక్తులయిన వాళ్లలో శ్రీరాముడు అగ్రగణ్యుడు . ఆ పల్కులను ఆలకించిన భరద్వాజుడు శ్రీరాముని చరిత్రను వినిపింపవలసిందని వాల్మీకిని వేడుకొన్నాడు. వాల్మీకి తెలిపిన రామకథ బది: 'శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో సూర్యవంశమందు శ్రీ రాముడుగా అవతరించి పదునారేండ్లు దాటని వయస్సున ప్రవర్తిల్లుతూ వుండగా ఒకనాడు దేవతలు ఇలా ప్రార్థించారు: 'దేవా! మానవాళిని ఉద్ధరించటానికై మానవుడవుగా జన్మించావు: కులగురుడైన వసిష్ఠుణ్ణి ఆశ్రయించి వేదాంతజ్ఞానసారాన్ని అలకించు! లోకు తెల్లరూ మిమ్మల్ని ఆదర్శంగా గైకొని గురుశుశ్రూష కావించి కృతార్థులై తరిస్తారు! శ్రీరాముడు దేవతల అభ్యర్థనను అంగీకరించి, ఐహికవిరక్తితో తీర్థయాత్రలు చేస్తూ, మున్యాశ్రమాలను సందర్శిస్తూ కొన్నాళ్లు గడపినాడు. అనంతరం ఆయోధ్యను చేరి తనకు మోక్షార్హతను ప్రసాదించే సద్గురువుము గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అయోధ్యకు విచ్చేసియున్న విశ్వామిత్ర మహర్షి విజయరాఘవుని విచారాన్ని గూర్చి విన్నాడు. ఆదరంతో దగ్గరకు పిలిచి, వాత్సల్యంతో ఇలా ఊరడించినాడు: “అప్నో! రఘురామా! నీకు తెలియని జ్ఞానం ఉన్నదా! ఐసో గురుముఖతః వినడలంబినావు కదా! ఈ కోరిక