పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

XV నీకు ఇంతటి పిన్నవయస్సులోనే కలుగటం విశేషం! శుకుడు నీలాగే పూర్వం తండ్రిని (వే వ్యాసుణ్ణి) అడిగాడు. తన సమాధానం కుమారుని సందేహాన్ని నివారింపజేయనందున, వ్యాసుడు శుకుణ్ణి మిథిలా నగరాధిపతియగు జనకునివద్దకు పంపినాడు. జనకుని వాక్కులపల్ల మన స్సంశయం తీరిన శుకుడు నిర్వికల్ప సమాధి ద్వారా ముక్తిని పొందాడు.' అని పల్కి. విశ్వామిత్రుడు రఘువంశ కులగురుడైన వసిష్ఠుణ్ణి చూచి 'యోగివర్యా! తమ ప్రియ శిష్యుడ్ కి తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించండి! అని ప్రోత్సహించాడు. వసిష్ఠుడు అందుకు అంగీకరించాడు. బ్రహ్మదేవుడు పూర్వం తనకు ఉపదేశించియున్న జ్ఞానసారాన్ని ఇలా విశదీకరింప నారంభించాడు: 'రఘువంశసోమా! శ్రీరామా! మానవ ప్రయత్నం (పౌరుషం) ఉచ్ఛాస్త్రము, శాస్త్రితము - అని రెండు రకాలు. అందులో మొదటిది ఐహకానికి సంబంధించింది. రెండవది పరమార్థ సౌఖ్యాన్ని ప్రాప్తింపజేసేది. కొబట్టి జిజ్ఞాసువైనవాడు రెండవదానిచే మొదటి దానిని అణచి వైచి, మనశ్శాంతిని పొందాలి. మోక్షమనే మందిరానికి 1) శాంతి ii) విచారం ii) సంతృప్తి iv) సత్సాంగత్యం - అనే నలుగురు ద్వారపాలకులు ఉన్నారు. ఈ నల్వురిలో ఏ ఒక్కరు పరిచయమయినా తక్కిన ముగ్గురు స్వాధీసులు అవుతారు. వీరి ప్రభావంవల్ల క్రమంగా సంసారబంధం తొలగిపోతుంది. ఈ విషయాలను ఎవరించే మోక్షశాస్త్రాన్ని తెలిసికోవడం వల్ల పూర్ణాయువు, ఆరోగ్యము, కీర్తి - మొదలైన సహిక ఫలితాలతో పాటు, జన్మరాహిత్యం కూడ చేకూరుతుంది. అనంతరం వనీషుడు కొన్ని ఉపాఖ్యానాల మూలంగా ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తిని గూర్చి వివరించాడు. ఆ ఉపాఖ్యానాల్లో మొదటిది ఆకాశజోపాఖ్యానము. ఆకాశజుడనే బ్రాహ్మణుడు ఎలాంటి కర్మములు చేయనివాడైనందున మృత్యుదేవి అతణ్ణి కబళింపజాలక పోయింది. రెండవదైన లీలోపాఖ్యానంలో పరమాత్మ మూ - త జగములను కల్పించే సరణి చెప్పబడింది. కర్కటికథ, ఇందు పుత్ర పాఖ్యానము, కృతిమేంద్రోపాఖ్యానము, చిత్రోపాఖ్యానము, బాలకోపాఖ్యానము, లవణ శాంబరికోపాఖ్యానము - వీటి ద్వారా విశ్వోత్పత్తికి సంబందించిన