పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii


* సాహితీ సౌరభం *

01 -07 -2008.

"భూమన్"

సంచాలకులు,

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు,

"శ్వేత", తి. తి. దేవస్థానములు, తిరుపతి.

మహాయోగిని తరిగొండ వెంగమాంబ రచించిన గ్రంథా లన్నింటిలో చిట్టచివరిది "వాసిష్ఠ రామాయణము". ఈ ద్విపదకావ్యం "యోగ వాసిష్ఠం", "జ్ఞాన వాసిష్ఠం” - మున్నగు పేర్లతో ప్రసిద్ధి గాంచిన సంస్కృత గ్రంథానికి అనువాదం. అనువాదమయినా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా సాగిన రచన!

వాల్మీకి రచించిన సంస్కృత మూలంలోని సారాన్ని స్వీకరించి, స్వానుభవంతో జోడించి, కవయిత్రి ఈ మహాకావ్యాన్ని సంగ్రహంగా, సామాన్యులకు సైతం సులభగ్రాహ్యంగా ఉండేటట్టు రచించింది. ఈ హేతువుచే ఈ గ్రంథంయొక్క వైశిష్ట్యం ఇనుమడించింది.

తేట తెలుగు పదాలతో తాత్విక విషయాలను బోధించటం వెంగమాంబకు వెన్నతో పెట్టిన విద్య - అనే విషయాన్ని 'తరిగొండ నృసింహ శతకం' మొదలుకొని, ఈ యోగేశ్వరి కృతులు అన్ని నిరూపిస్తూ వున్నాయి, ఆ అన్నింటిలోనూ ఈ కావ్యం అగ్రగణ్యంగా అలరారుతూవుందనేది సత్యం!

గడచిన శతాబ్ది ఆరంభంలో గుజిలీప్రతిగా మద్రాసులో ముద్రితమైన ఈ తాత్విక కావ్యం తి.తి.దే. మాతృశ్రీ తరిగొండ వాఙ్మయ ప్రాజెక్టు పక్షాన వ్రాతప్రతుల సాహాయ్యంతో చక్కగా పరిష్కృతమై ఇప్పుడు పునర్ముద్రణ పొందుతుండటం చాలా సంతోషించవలసిన విషయం..