పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

ఈ ఆధ్యాత్మిక కవయిత్రి ఆ ప్రణాళికను పుణికిపుచ్చుకొని, స్వతంత్రంగా, సంగ్రహంగా, తెనుగు జాతీయచ్ఛందమైన ద్విపదలో సులభశైలిలో ఈ కమనీయకృతిని వెలయించింది.

పరమయోగులైన ఆళ్వారులవంటి మనఃపరిపక్వత గలిగిన ఈ మహాయోగిని యొక్క రచన లన్నిటిలోనూ సురుచిరమణిహారంలో సువర్ణసూత్రంవలె తత్త్వజ్ఞానం (Philosophy) భాసిస్తూ వుండటం ఈ సందర్భంలో ప్రశంసింపదగిన ప్రత్యేకాంశం!

తి. తి. దే. "శ్వేత" సంస్థ సంచాలకులు, "మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు డైరెక్టరు శ్రీయుతులు "భూమన్"గారి దీక్షాదక్షతలవలన ఈ వాఙ్మయపీఠం అచిరకాలంలో వెంగమాంబగారి తదితరరచనలను, సాహిత్య సదస్సులకు సంబంధించిన వ్యాససంకలనాలను, సంచికలను, తులనాత్మక పరిశీలనలను, శబ్దసూచికలు concordances మొదలైనవాటిని క్రమేణ ప్రచురింపగల దని ఆశిస్తున్నాను, ఆశంసిస్తున్నాను.

సదా శ్రీనివాసుని సేవలో

కె.వి. రమణాచారి