పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

వాశిష్ఠరామాయణము



పుట్టినవారెల్లఁ - బోవుట నిజము,
నెట్టనఁ దిరముగా • నిల్వ రెవ్వరును,

కలలవంటిది యీ జ-గంబులో రీతి:
తెలిపెద నెట్లన్న - డేటగా వినుము!

నానాశరీరముల్ - నశియించి పోవు.
నూని శాశ్వతముగా - నుండు జీవుండు.940

ఆ విధమెల్ల నీ - వరుదుగాఁ జూడఁ
గా వలసినఁ జూతు - గాక! నీకిపుడు

తిరముగా జ్ఞానోప-దేశంబుఁ జేతు
నరసి భావించు చి-త్తాకాశ మొకటి,

యసుపమంబైన చి-దాకాశ మొకటి,
యొనరంగ నాకాశ - మొకటి యీ మూఁడు

గలవినెప్పుడు నిరా - కారంబు లగుచు
నలరఁగా నొండొంటి - నంటక యుండు

[1]జగతివే యాకాశ - శబ్ద వాచ్యంబు
లగును, చిత్తాకాశ - ముందు నాకనము 950

నందుఁ బొందకనె చి - దాకాశ మొప్పు,
నందుఁ జిత్తాకాశ - మను దాని యందు

గడఁకతో వృత్తి[2] వి - కారంబు లుండు,
నడరార నాకాశ - మందుఁ బూర్ణతయు ,

జడత గలిగియులకు - సతత మారెంటి
కెడమై వికారత్వ, - మిల జడత్వముసు

  1. జగతిన్ ఇవే అని పదవిభాగము
  2. యే కాలంబు లుండు