పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

వాసిష్ఠరామాయణము


* లీలో పాఖ్యానము *

కమనీయ సామ్రాజ్య - కలితుఁ డనంగ
నమరెడు పద్మకుఁ - డను మహీపతికి

నలర భార్యామణి - యైనట్టి లీల
వలనొప్పఁగా సర - స్వతినిఁ బెక్కేండ్లు

కడఁక నుపాసింపఁ - గా వాణి వచ్చి
పొడసూప, లీల తె - ప్పున లేచిమ్రొక్కి

వినుతులు పెక్కు గా - వింప, నవ్వాణి
'వనిత! నీ కిపు డేమి - వర మిత్తు' ననఁగ

నీ లీల పలికె 'నా - కన్న ముందుగను
తాలిమి లేక నా - ధవుఁ డొకవేళ 900

[1]దెప్పునఁ గాల గ - తినిఁ జెందెనేని
యొప్పి నాయింట [2]జీ - వుం డుండు నట్టి

వర మీయు, మదిగాక - వరుఁడు దేహంబు
దొరఁగిన తఱి నాకుఁ - దోడుగా నీవు

వచ్చి నాపతిఁ బ్రోవ - వలె' నన్న వాణి
మెచ్చి యిట్లనియె 'నో - మెలఁత! నీవిభుఁడు

తనువు వీడిన వేళఁ - దడయ కా క్షణమె
పనిఁబూని సుమమంట - పంబుఁ గల్పించి,

యందు నీ పతి నుంచి - యపుడె పుష్పములఁ
బొందుగాఁ బైనఁ గప్పుము, దానఁ దనువు 910

  1. గప్పి తెప్పునఁ గాల గతి నొందెనేని - వా.
  2. జీవుండున్నయట్టి - వా.