పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

వాసిష్ఠరామాయణము

కొదువ యే మన్నను-గురుముఖంబునను
విదితంబుగాఁ దత్త్వ-విజ్ఞాన సరణి350
వినకయే తొలుత వి-వేకంబుచేత
ఘనవిరాగము నీకుఁ-గలిగియుండియును
అనుమాన మొందితి,-వంతియే కాని
జననుత! నీకు మో-క్షము గల్గు టరుదె?
మహిని ముముక్షు ధ-ర్మము బాల్యమందె
సహజంబుగా నీకు-సంభవించినది.

శుకుని వృత్తాంతము



ఇపు డిందు కితిహాస-మేను చెప్పెదను
నిపుణుండవై విను-నీరీతి శుకుఁడు
మొనసి తనంతనే-మోక్ష ధర్మముల
ననఘుఁడై తెలిసియు,-ననుమానమొంది360
తన తండ్రియైన వేదవ్యాసుఁ జేరి
వినయంబుతో [1]విన్న-వించె నిట్లనుచు:
'జనక! యీ మలినంపు-సంసార మెచట
జనియించె? నెవరి దీ-సంసారవాంఛ?
ముందఱ గతి యేమి?-మూఢ సంసార
మెందు లయంబొందు?-నెఱిఁగింపుఁ డనుచుఁ


  1. విన్నవించి యిట్లనియె - వేం.