పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

ఈ యిరువురు సారస్వతమూర్తుల్లో ఒకరు అహోబల లక్ష్మీనృసింహస్వామి భక్తులు కాగా, ఇంకొకరు తరిగొండ లక్ష్మీనృసింహస్వామి భక్తులు. ఈ విధంగా ఈ యిద్దరూ నృసింహోపాసకులే అయివుండటం ఈ సందర్భంలో ఎన్నదగిన అంశం!

మొత్తం మీద, తాత్త్విక విషయాలను సామాన్య జనులకు సుబోధంగా వెల్లడించటానికి పద్యంకన్నా ద్విపద మిగుల అనువయినదనే సూక్ష్మాంశాన్ని ఈ ద్విపద కావ్యం సముచితంగా నిరూపిస్తూ వున్నది.

తిరుమల తిరుపతి దేవస్థానముల “శ్వేత" సంస్థ ఆధ్వర్యంలోని “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు " ఇలాంటి విశిష్ట ప్రచురణలను ఇతో౽ధికంగా చేపట్టి ఈ “కవితాతపస్విని" సృజించిన వాఙ్మయ రాశిని విస్తృతంగా వెలుగులోకి తీసికొనిరాగల రని ఆశిస్తున్నాను. ఆశంసిస్తున్నాను.

సదా శ్రీవారి సేవలో

భూమన కరుణాకరరెడ్డి