పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

oil గురువంచకులును, మూ-ర్జులు, దాంభకులును, పరధనాసక్తులు, పరసతీరతులు కావున బహువార-కములందు మునిగి పోవుదు రనీ తన బుద్ధి నూహించి, శోకింపుచుండెడి సుతులకై తాను శోకించు జనకుని చొప్పున నజుఁడు చింతించి, జప, హోమ, శీల, ధర్మములు, వంతుకెక్కిన తపో-వ్రతములు జనుల శాంతిఁ బొందింపఁ జాల, వందటికి సంతోషమిచ్చు సు-జ్ఞానం బటంచు మది నిశ్చయించి, స-మ్మతముగా నన్ను మురమొప్పఁ దన మనం-బుననె సృజించె." -ఆది ప్రకరణము, 511-516 ద్విపద పంక్తులు, పుటలు 25-26. ఈ కావ్యం యొక్క ఉపక్రమ, ఉపసంహారాలు, వేర్వేరు ప్రకరణాల ఆద్యంతాలు మిగుల నిరాడంబరంగా నెలకొనివుండి, ఈ కావ్యానికి నిండుకుంఠతోడి సామ్యాన్ని సంతరింపజేశాయి. ఒక్క మాటలో, అతిగహనములైన అధ్యాత్మిక విశేషాలను తేట తెలుగు ద్విపదలలో సులభమైన శైలిలో సుబోధంకావీస్తూ వున్న ఈ కృతిరత్నం తెలుగులో వెలసిన వేదాంతకావ్యాల్లో అద్వితీయంగా అలరారుతూవుంది! ఒకటి రెండు ముఖ్యాంశాలు: 1) తాత్విక కవయిత్రి, సహజ కవయిత్రి, ఆశుకవయిత్రియైన వెంగమాంబ ఈ ద్విపదకావ్యంలో కొన్నిచోట్ల తత్త్వ కీర్తనల శైలిలో ద్విపదలను నడపినది. ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడుతూవున్న ఆ ద్విపద పంక్తులు తగిన రాగంతో జతగూర్చి తత్వ కీర్తనలుగా పాడుకోవటానికి అనువుగా అమరి ఉన్నాయి.