పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

roi రాజవిద్య: ఈ తాత్వికకావ్యంలోని ఉపాఖ్యానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇవి చాలవరకు రాజులకు సంబంధించిన గాథలుగా వున్నాయనే సత్యం విదితమౌతూవుంది. ఈ అంశాన్ని బట్టి, యువరాజైన రఘురాముడు సందేహనివృత్తిని పొంది స్వధర్మమునందు ప్రవృత్తు డపటానికై కులగురువగు వసిష్ఠభగవానుడు అలాంటి రాజన్యుల వృత్తాంతాలనే ఎన్నుకొని, దాశరథికి తత్త్వబోధ కావించియున్నా దని భావింపవచ్చు. ఇందువల్లనే కాబోలు, ఈ కావ్యంలో ప్రపంచింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానం "రాజవిద్య"గా పేర్కొనబడింది. ఈ అభిప్రాయమే బృహద్ వాసిష్ఠరామాయణ మందలి ఈ క్రింది శ్లోకంలో స్పష్టంగా ఉల్లేఖింపబడింది: “అధ్యాత్మవిద్యా తే నేయం పూర్వం రాజసు వర్ణితా! తదనుప్రసృతా లోకే రాజవిద్యే త్యుదాహృతా!" 'ఈ అధ్యాత్మవిద్య పూర్వకాలంలో రాజులకు చెప్పబడింది. అటు తరువాత లోకంలో ప్రచారం కావింపబడింది. అందువల్ల ఇది 'రాజవిద్య'గా పేర్కొనబడింది." పైన తెల్పిన రీతిగా ఇది 'రాజవిద్య యైనను, రాజులకేగాక, తదితరు లందరికిని ఆవశ్యకమైనదే. 'రాజైన (శ్రేష్ఠమైన) విద్య'యైన ఈ దివ్య జ్ఞానాన్ని వ్యాపింపజేసి, లోకాన్ని ఉద్ధరించటానికే బ్రహ్మదేవుడు వసిష్ఠుణ్ణి సృజించినాని ఈ క్రింది ద్విపద పంక్తులలో ప్రకటింపబడింది: “సరస భారతవర్ష - సంభవులైన నరులు పామరులు, నా-సావిధాప్యాయ కలితులు, లోభులు, - కాముకుల్, జడులు .బల్లవిహీనంలు, మోహ పరవశుల్, శరులు, - 1. చూ. యోగవాసిషము', vel 1, ముముకు వ్యవహార ప్రకరణమ్, 1280 17. ఏర్పేడు ఆ వ్యాసాశ్రమము వారి ప్రచురణ, తృతీయ ముద్రణ 1007}.