పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ex 11 స్వతంత్ర కల్పనలు: కవయిత్రి ఈ కావ్యంలో కల్పించిన కథాంశాల్లో దేవతలు శ్రీరాముణ్ణి ప్రార్థించటం ఒకటి: 'దేవాదిదేవా! నీవు దశరథపుత్రుడవుగా అవతరించిన శ్రీమహావిష్ణుదేవుడవు. మానవాళిని మోహసముద్రంలో పడి మునిగి పోనీయకుండా ఉధ్ధరించే కారణకర్తవు. కాబట్టి, వసిష్ఠ సంయమిని ఆశ్రయించి, సరస వేదాంత విజ్ఞాన ధర్మాలను ఆలకించవలె' - అని అనిమిషులు బహురీతుల ప్రార్థిస్తారు. శ్రీరామచంద్రుని పరాత్పరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కవయిత్రి ఈ కల్పనను కావించింది.' వెంగమ్మ ఈ మహాకావ్యంలో కానించిన స్వతంత్ర కల్పనలలో పూర్వరామాయణ కథాసంగ్రహం అత్యంత ముఖ్యమైనది. వసిష్ఠుడు తనకు జ్ఞానోపదేశం చేసిన పిమ్మట, విశ్వామిత్రుని వెంట యాగ సంరక్షణార్ధమై లక్ష్మణునితో పాటు వెళ్తాడు. ఆది మొదలుకొని, శ్రీరాముడు రావణున్ని సంహరించి, సీతాసమేతుడై అయోధ్యనుచేరి, పట్టాభిషిక్తుడై, ప్రజలను పాలించేటంత వరకు గల యావద్రామాయణకథ నిర్వాణ ప్రశరణం చివరన సంగ్రహంగా ముప్పది రెండు ద్విపదలలో సమకూర్పబడింది. ఈ సంగ్రహరామాయణ మహనీయగాథ ఈ కథను మంగళాంతం కావిస్తూ, వాసిష్ఠ రామాయణ మహాకావ్యానికి మకుటాయమానమై చిలసిల్లుతూవుంది! ఈ రీతిగా అవకాశం లభించిన ప్రతిచోటా రామకథను సమగ్రంగా, సంగ్రహంగా, వర్ణించటం ఈ కవయిత్రీమతల్లికి మిగుల అభిమానపాత్రమైన విషయం?" 1. చూ, అందే, అది ప్రశరణము, పుటలు. 6-7, 2. చూ. అందే, వంచమప్రకరణము, పుటలు.345-348. 13.i) | వేంకటాచల మాహాత్మ్యము' (పద్యకావ్యం లో వైశుండ గుహావృత్తాంత సందర్భంలో కవయిత్రి సూతునిచే రామకథను సంగ్రహంగా చెప్పించింది. చూ. [ఆశ్వా.. 242-244 వ. fi} 'జధిక్రీడావిలాసము' (యక్షగానం) లోమా వెంగమాంబ యశోదచే బాలకృష్ణునకు రామాయణగాథను “ఉకుడు కత"గా చెప్పించింది, చూ, పుట......