పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xix ఈ ఉపాఖ్యానికి ఇంతటి ప్రాముఖ్యం ఉన్నందువల్లనే వెంగమాంబ దీనిని మరింత సంక్షేపించక, మూలానికి కుడియెడమగా అనువదించింది. మూలంలో 640 శ్లోకాల్లో ఉన్న ఈ కథాంశాన్ని కవయిత్రి దాదాపు 600 ద్విపదల్లో వెలయించింది. వెంగమాంబ వాసిన రామాయణ ఆనువాడ పద్ధతికి ఈ ఉపాఖ్యానం ఒక ఉత్తమోదాహరణం. వాసిష్ఠంలో శ్రీరాముడు తీర్థయాత్రలను కావించినట్లే, ఇందులో శిఖిధ్వజుడు తీర్థయాత్రలు చేసి వస్తాడు. ఈ శిఖిధ్వజుని తీర్థయాత్రా వృత్తాంతం కవయిత్రి కల్పించిందే! ఈ కథాంశకల్పన వల్ల ఈ ఉపాఖ్యానానికి ప్రధానకథతో చక్కని సామ్యం సిద్ధించింది. ఈ మహా కావ్యంలో ప్రతిబింబించిన ఆ యా పాత్రల చిత్రణకూ, సన్నివేశాల చక్కదనానికి, సంభాషణల తీర్మానానికి ఈ శిఖిధ్వజోపాఖ్యానం ఒక మచ్చు తునక! చూడాల ధరించిన కుంభుడనే బ్రహ్మచారి స్వరూపం, కుంభుడు శిఖధ్వజుణ్ణి ఆశ్రమంలో ప్రప్రథమంగా కలిసికొన్న సన్నివేశం, కుంభుడు శిఖధ్వజునికి కాపించిన జ్ఞానోపదేశం - అనేవి అందుకు క్రమంగా ఉదాహరణలు. ఒక్కమాటలో, ఈ ఆధ్యాత్మిక కావ్యం యొక్క సందేశమంతా కుంభుడు (చూడాల) శిఖధ్వజునకు దెల్పిన గజోపాఖ్యానంలో నిక్షేపింపబడివుంది.' మొత్తంమీద వెంగమాంబ వాసిష్ఠ రామాయణానువాదం మూల కథాసూత్రం ఆలంబనంగా అవశ్యకమైనచోట్ల చేయబడిన చిరుమాడ్పులతో, సహజమైన భాషలో, సరళమైన శయ్యలో, సంగ్రహంగా, స్వేచ్ఛగా, సుందరంగా సాగింది. 7. చూ. 'లఘుభయోగ వాసిష్ఠ్వు', VI ప్రకరణమ్, 9 సరః, పుటలు 664,864. 8. చూ. 'వాసిష్ఠ రామాయణము , చతుర్ధ ప్రకరణము, పుటలు.244-292. 9. చూ. 'వాసిష్ఠ రామాయణము', అందే పుటలు.258, 253. 13. చూ.అంటే, పుటలు 267.270.