పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

XVN ఈ కవయిత్రి అనువాద విధానానికి మరో ఉదాహరణ 'శిఖధ్వజోపాఖ్యానము'. 'చూడాలకథ' - అనేది దీనికి నామాంతరం. మాళవదేశపురాజు శిఖధ్వజుడు. అతని భార్య చూడాల. చాలాకాలం రాజ్యసుఖాలను అనుభవించిన తదుపరి ఆ దంపతులకు అత్మజ్ఞానాన్ని గూర్చిన జిజ్ఞాన కలిగింది. చూడాల సురుచిర ప్రయత్నంతో ఆచిరకాలంలోనే తత్త్వజ్ఞానాన్ని సాధించింది. తన కది సిద్ధింపనందు వల్ల శిఖిధ్వజుడు విరక్తుడై అడవికి వెళ్లి, తీవ్రంగా తపమాచరింప నారంభించాడు. అందువల్ల, రాజ్యపాలనాభారాన్ని వహించిన చూడాల యోగశక్తిచే అప్పుడప్పుడు భర్త (శిఖిధ్వజుని) ఆశ్రమానికి 'కుంభుడనే మునికుమారుని రూపంతో వెళ్లి, ఆతనికి తత్త్వజ్ఞానాన్ని చక్కగా ఉపదేశిస్తూ వచ్చింది. ఆ విధంగా తనకు జ్ఞానోదయం కావటానికి కారణుడైన ఆ ఋషి కుమారుడు తనపత్నియే అని రాజు చివరకు గుర్తించి సంతోషించాడు. అలాగ పరిపూర్ణ జ్ఞానవంతులైన ఆ రాజదంపతులిద్దరు రాజధానిని ప్రవేశించి, మునుపటి రాజభోగాలను అనుభవించటం ద్వారా ప్రారబ్దాన్ని ముగించి, పరమపదవిని పొందినారు. ఈ ఉపాఖ్యానం వాసిష్ఠరామాయణం యొక్క స్వరూప స్వభావాలకు సంగ్రహరూపేణ ప్రాతినిధ్యం వహిస్తూ వుంది. ఈ కావ్యంలో అనేక ఉపాఖ్యానా లున్నట్లే, ఈ కథలోనూ కిరాట, చింతామణి, గజేంద్ర- ఉపాఖ్యాసాలనే చిన్నచిన్నకథలు అంతర్గతములై ఉన్నాయి. ఈ ఉపాఖ్యానం మొత్తం మీద ఈ కావ్యం ఉద్దేశించిన తాత్త్విక సందేశాన్ని అందివ్వగల్గినదై వున్నది.