పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

wil వసిష్ఠమహర్షి ఆకర్షణీయములయిన వేర్వేరు ఉపాఖ్యానాల ద్వారా వేదాంత విజ్ఞానాన్ని ఉపదేశించి వుండటంచేత ఈ కావ్యం చిత్ర విచిత్రాలైన కథలకు నిలయమై వెలసింది. ఇలాంటి విచిత్రకథలు చిన్నవి. పెద్దవి కలిసి ఈ కృతిలో ఇంచుమించు ఏబది ఉన్నాయి. ఇలాగ కమనీయ కథల నెపొన తాత్విక సందేశాన్ని లోకానికి అందిస్తున్న ఈ ఆధ్యాత్మిక కావ్యాన్ని ఆంద్రీకరించటంలో వెంగమాంబ ప్రతి ఉపాఖ్యానాన్ని వీలైనంత మేర సంగ్రహించి, తత్సందేశాన్ని స్వానుభవ మిళితంగా, సూటిగా, సులభశైలిలో తెలియబల్కింది. ఆది ప్రకరణంలోని 'లవణ శాంబరికోపాఖ్యానము' ఈ విషయమై ఒక చక్కని ఉదాహరణం. లవణుడనే రాజు తన కొలువులోకి వచ్చిన ఓ కానౌక ఐంద్రజాలికుని మాయవలన జవనాశ్వాన్ని ఎక్కిపోయి, ఘోరారణ్యంలో నివసిస్తూవున్న చండాలయువతిని పెండ్లాడుతాడు. ఆమెవల్ల అనేకసంతానాన్ని పడసి, అనేకవత్సరాలు జీవించి వృద్ధుడై, కఱవు బాధతో ఒకనాడు అగ్నిలో ప్రవేశిస్తాడు. ఈ అనుభవమంతా ఆ రాజు సింహాసనం మీద కనుమూసీ నిద్రించినట్లున్నంత సమయంలో కలవలె జరిగిపోయింది. అటు పిమ్మట లవణుడు ఉలికి పడి మేల్కొంటాడు. మంత్రులు ఉలికిపాటుకు కారణం అడుగగా, ఆ రాజు వారీ కందరికి తన స్వపానుభవాన్ని వివరిస్తాడు. ఈ వృత్తాంతం మూలంలో తొంభైశ్లోకాల్లో వర్ణింపబడివుంది. ' కవయిత్రి ఈ కథను కేవలము 28 ద్విపదల్లో సంగ్రహీకరించింది. దేశ కాలాలు మనస్సుకు అధీవాలు. మనో విలసనమే జీవునికి బంధం. దానిని నిరాకరించటమే ముక్తి. మనోవిలాసంవల్ల గోష్పాదం (ఆవుకాలి గుర్తు) అంత ప్రదేశంకూడా ఆమడగా తోస్తుంది.ఒక క్షణ కాలం కూడా బ్రహ్మకల్పంగా భాసిస్తూ వుంటుంది. ఈ శాశ్వత సత్యాన్ని బోధించటానికే వసిష్ఠుడు లవణోపాఖ్యాపాన్ని తెల్పినాడు. 5. చూ. 'లఘుయోగవాసిష్టు: III ప్రకరణమ్, తిసర్గః, పుటలు 83-85. 6. చూ. 'వాసిష్ఠ రామాయణము', పుటలు79-81.