పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

వాసిష్ఠరామాయణము


కాలమృత్యువు నోటి - కబళంబు లగుచు
భూలోకమున గిట్టి - పుట్టుట సుఖము

కా దని, వైరాగ్య - కలితాత్ములైన
వేదాంత వేత్త లే - విధమున ధరను 650

మెలఁగుచుండుదు రట్ల - మెలఁగుచునుండు!
కలుగ వావల జన్మ - కర్మ దుఖములు;

అంతరాస్థ నణంచి, - యట సేయుపనుల
నెంతని విడువక, - యెఱుక దప్పకను

సేయఁగాఁ దగుపనుల్‌ - చేయుచుండినను
మాయలే కణఁగు, చి - న్మయ మగునంత;

నిచ్ఛలేకయె రత్న - మెపుడు తనంత
స్యచ్చమై వెలిఁగెడి - చందంబుగాను

నణురూపమై పర - మాత్మునియందు
గణుతి కెక్కుచును లో - కములు తమంత 660

నే తాము లీలగా - వెరసి వెలుంగు,
నాతతంబుగ నాత్మ - యందుఁ గర్తృత్వ

మును, నకర్తృత్వ మి - మ్ముగఁ దోయచుండుఁ;
గనుంగొను నాసలే - కనె చేయుచుండుఁ,

గనుకను దాఁ - గర్త గా, దొక కర్త
యొనరంగఁ దనచెంత - నుండుటఁజేసి

పూని కార్యముల నె - ప్పుడు చేయు నెడలఁ
దాను గర్త నటంచుఁ - దలఁపక సేయఁ,

దగు కార్యములు చేసి - తాఁ గర్త ననక
జగతి నిర్లేప సం - జ్ఞను బొందవలయు; 670