పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

119

ద్వితీయప్రకరణము

 
వరుస భావన నభా - వంబు చేసినను:
గరఁగి సంకల్పముల్‌ - గళితంబు లగును;

కడను సంకల్పముల్‌ - గళితంబులైన
నెడలేని సంతోష - మిరవొందు మదిని,

జనన మొందెడి యస - త్సంకల్పములను
మొనసి నత్సంకల్ప - మున నిగ్రహించు!

మనముచే మనమును - మడియించు మవలఁ,
గనినను నీకు దు - ష్కరముగా దెద్ది' 630

యనుచు దాశూరుఁడి - ట్లని కుమారునకు
వినిపెంచెఁ బరమైన - వేదాంత' మనుచు

మునిదయ మీఱ రా - మున కెఱింగించి,
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె:

'ఇలను మనోజాల - మిట్టిది యనుచుఁ
దెలిసి ధీరతను వ - ర్తింపుచునుండు!

లీలగాఁ దుద మొదల్‌ - లేదు కాలమున,
కేలాగుఁ జూచిన - నిదమిత్థ మనుచు

నెఱుఁగ శక్యంబుగా, - దెన్న నూఱేండ్లు
నరుఁడు జీవించు ని - ర్ణయముగా ననుచుఁ 640

బట్టుగా వేదంబు - పలుకుచునుండు;
నట్టినియతి దప్పు, నర్ధకాలంబు

బ్రదికి యుండుట దుర్ల - భంబుగా నుండు:
ఇది నాది, నే నని - యెల్ల మానవులు

వదలక సంసార - వనధిలో మునిఁగి
సదమల జ్ఞాన వి - చారంబు లేక