పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

వాసిష్ఠరామాయణము


దనయుని మన్నించి - దాశూరుఁ డనియె:
'విను మా యనంతంబు - విమల, మద్వయము

ననఁదగు పరమాత్మ - కాదికాలమున
జననమైనట్టి సం - సారోన్ముఖతయె

అవిరళసంకల్ప - మగు, నదెట్లనిన
లవమాత్ర మగు చిదు - ల్లాసపరాత్మ

రూపింవ నజడస్వ - రూపమై మింటఁ
జూపట్టు జలదంబు - చొప్పున మించి

దట్టమై తానె చి - త్తం బగుచుండుఁ;
బట్టుగా మాయా ప్ర - పంచ భావనకుఁ 610

గన వ్యతిరిక్తంబు - గాం దోఁచుచుండు,
ననువొందఁగా బీజ - మంకురంబైన

గతిఁ బ్రపంచంబు సం - కల్పమే యగును.
ప్రతిభ నీ సంకల్ప - భావన తనకుఁ

దానె గల్గుచుఁ దనం - తనె వృద్ధి యగుచుఁ
దానె యణఁగు నీటి - తరఁగలరీతిఁ,

గాన డీన సుఖంబు - గలుగ దెన్నటికిఁ,
బూని మహాదుఃఖ - ములను బుట్టించుఁ

గావున నీవు సం - కల్ప భావనలఁ
బోవీడి నుఖమొందు - పుత్ర! యెట్లనిన 620

మొనసిన సంకల్ప - ములు నశించినను
మునుపు పుట్టు ప్రయత్న - ములు గల్గవవల,


2. లవమాత్రమగుచు నుల్లాసంబు నాత్మ