పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

117

ద్వితీయప్రకరణము


ననఁగాను, మధ్యమం - బనఁగ నొప్పుచును
దనరుచున్నటువంటి - తామన, సత్త్వ,

రాజసగుణ శరీ - రంబులు మూఁడు
మోజుగాఁదాల్చు ని - మ్ముగ న దెట్లనిన 580

సరవినిఁ దామస - సంకల్ప మహిమ
నఱిముఱి గ్రిమికీట - కాదులైనట్టి

జననంబు లొందును, - సత్త్వ సంకల్ప
మున వివేకశరీర - ములను ధరించు;

సారెకు రాజస - సంకల్ప మహిమ
నారయ మూఢ దే - హముల ధరించు;

మొనసి యీ సంకల్ప - ములు మూఁడు విడిచి,
తనలోని పరమాత్మ - తత్వంబుఁ దెలియఁ

గోరు, సంకల్పంబు - కొనసాఁగి పొడమ
నారూఢిగాఁ బొందు - నయ్యాత్మయందు, 590

సరసాత్మ! సర్వ వి - షయ జాలములను
నిరసించి విడిచిన - నిర్మల మనము

చేతనే మనమును - జెదరిపోనియక
యేతీరుగానైన - నెఱిఁగి బంధించి,

పట్టుచు మఱి మఱి - బాహ్యాంతరములఁ
బుట్టెడి సంకల్ప - ముల వీడు' మనిన

విని యక్కుమారుండు - వేగ ని ట్లనియె:
'జనక! యీ సంకల్స - జాల మెచ్చోటఁ

గలుగుచునుండు? నే - గతి వృద్ధిఁ బొందు?
విలయ మెట్లగు? నది - వివరింపు' మనినఁ 600