పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

121

ద్వితీయప్రకరణము


నటు గాకయుండిన - నంతటి కేను
ఘటకుండ నని నీవె - కర్తృత్వ మొంది,

సకలకార్యములను - సమబుద్ధిచేత
వికలత లేక వి - వేకివై నడుపు!

మొలచు రాగద్వేష - ముల మోదఖేద
ముల యందుఁ బొంద, కి - మ్ముగ నెప్పుడైన

లలిని సంకల్ప జా - లంబు నణంపఁ,
జెలువొప్ప సమతచేఁ - జిత్తు దీపించు

గాన, నకర్తృత్వ - కర్తృత్వములను
మాని, మనోలయ - మార్గంబు నొంది, 680

నీవు సుఖింపుచు - నెమ్మది నాత్మ
భావించినంతటఁ - బరిపూర్ణమగును.

తనువు తా నను నహం - తను విచారింప
సునిశితంబుగఁ గాల - సూత్రనారకము

గాన వీడందగు - ఘటము నే ననుట,
మానవేశ్వర! యొక - మర్మంబు వినుము!

అంతకు నేఁ గర్త - ననియైనఁ దలఁపు,
మంతకుఁ గర్త కా - నని యైనఁ దలఁపు,

మింతటికినిఁ గర్త - యెవఁడు? నే నెవఁడ?
నింతింత యనఁగూడ - దీ వింత యనుచు 690

నైనఁ దలఁపుచుండు, - మస్థిరంబైన
మేను నే ననకు సు - మీ! రామ! దేహ