పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

111

ద్వితీయప్రకరణము


మొనయు నజ్ఞానాంశ - ములు సతీసుతులు,
ధనధాన్య ముఖ్య సంప - దలుగాఁ దలఁచి,430

మొనసి తత్సుఖ దుఃఖ - ముల మది రోసి
నను సదా నిశ్చలా - నందంబు కుదురు;

అరయఁగా మూర్ఖాత్ము - లగువారితలఁపు
లఱి ముఱి మోహ శో - కాబ్ధుల మునుఁగు;

నటువంటి తలఁపులే - యతివివేకులకు
ఘటిత వైరాగ్యసౌ - ఖ్యంబు పుట్టించి

జననాథ! చేఁ దప్పి - చనినట్టి కార్య
మునకుఁ జింతింప, కి - మ్ముగ దాని విడుపు

మల కాలవశమున - నబ్బిన సౌఖ్య
ముల నీ వనుభవించు - మోహివిగాక,440

కలిగెడు సుఖము దుః - ఖము మిథ్య లనుచుఁ
దెలియ నేర్చిన మహా - ధీర చిత్తుండు

ఆ సుఖదుఃఖంబు - లందంటి యంట
కీసూర్యుఁ డున్నట్ల - యింపొందు చుండు.

నొకవేళ శివునిచే - నుదయించు సృష్టి,
యొకవేళ నజునిచే - నుద్భవం బగును.

నొక వేళ విష్ణు దే - వునిచేతఁ గల్గు,
నొక యెడ మునులచే - నుత్పన్న మగును,

నొక తఱి గమల మం - దుదయించు బ్రహ్మ,
యొక వేళ జనియించు - నుదకంబునందు, 450