పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

వాసిష్ఠరామాయణము

మెలఁగుచు నుండు తు - మ్మెదరీతి నందు,
బలసి పిమ్మట మనో - భావ వేగమున

లలిమీఱ బిల్వ ఫ - లంబు చందమున
సొబయక బళువుగా - స్థూలమై యదియె 410

చెలువొప్పఁ గరఁగి పో - సిన పైఁడి బొమ్మ
వలెఁ బ్రకాశించి, య - వ్వల నాకనమున

మొనసి తత్తద్రూప - ముల వెల్గుచుండుఁ;
దనరఁగా వాని కూ - ర్థ్వంబు శిరంబు,

నుదరంబు మధ్యంబు, - నొగి హస్తములును,
ముదమొప్పఁదగు పార్శ్వ - ములు, పాదములును

చాల నధంప్రదే-శముగాం నిట్లు
కాలవశంబునఁ - గాయమై నిలిచి

గణుతి కెక్కుచు బుద్ధి - ఘనసత్త్య ముఖ్య
గుణములు తనయందు - గుమికూడి మెఱయఁ 420

దరమిడి లోక పి - తామహుండైన
వరమేష్ఠి యుదయించుఁ - బరమార్థమైన

యతనికి జన్మల - యంబులు గల్ల
వతిశయ మిథ్య లై - నట్టి భావనల

చేతనే గల వంచుఁ - చెప్పఁగాఁబడును.
ఖ్యాతిగా నటుగానఁ - గర్మ సంసార

కలిత తృష్ణా భుజం - గంబును ద్రుంచి
యలఘు సౌఖ్యము నొందు - మాదిత్యకులజ!