పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

వాసిష్ఠరామాయణము


నొక కాలమునఁ బుట్టు - నురుతరాండమున,
నొక వేళఁ బొడమునీ - వ్యోమంబునందు,

నొక వేళఁ దరులతా - యుత యగు భూమి,
యొక వేళ నరులతో - నొప్పు నిద్దాత్రి,

యొక వేళ గిరులచే - నోగిఁ బ్రకాశించు,
నొక వేళ భూమి తా - నొక్కటే యుండు,

నొక వేళ మొఱప రా - ళ్లుండు నెల్లెడల,
నొకవేళఁ గనకమై - యొప్పు నిద్ధాత్రి,

యొక వేళ నాకాశ - ముదయించు మొదట,
నొక వేళయీ భూమి - యుదయించుఁ దొలుత, 460

నొక వేళ నాది యం - దుదకంబు పుట్టు,
నొక వేళ పాపకుఁ - డుదయించు మొదట,

నొక వేళఁ దొలి వాయు - వుద్భవం బందు,
నిఁక నెన్ని చెప్పు ద - నేక చిత్రములఁ

బ్రకటమై తోఁచుఁ బ్ర - పంచ మీరీతి
నొక బ్రహ్మపుట్టు వే - నొనరఁ జెప్పితిని

అమితంబులైన బ్ర - హ్మల పుట్టువులను
గ్రమముగా నెపరును - గణుతింపలేరు.

నిక్కంబుగా విధి - నిర్ణయం బనుచుఁ
జక్కఁగా సృష్టి ము - చ్చట చెప్పఁదరమె? 470

మానవేశ్వర! జగ - న్మాయా స్వరూప
మేను జెప్పెద నది - యె ట్లన్న వినుము!