పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107

ద్వితీయప్రకరణము

భీముల కథలఁ జె - ప్పితి' నన్న రాముఁ
డా మునిఁ గాంచి 'వి - శ్వాతీతమైన

పరమాత్మయందీ ప్ర - పంచ మేరీతి
నిర వొందు?' ననఁగ ము - నీంద్రుఁ డి ట్లనియె:

'నమలాత్మ! రామ! చి - దాకాశమందు.
భ్రమకాకరంబై ప్ర - పంచ మంతయును 340

ఊరకే యెండమా - వులయందు నీళ్ళు
పాఱిన గతిఁ గనం - బడు మృగంబులకు,

సటువలెఁ, దనయాత్మ - నంటిన మదము
పటిమ నన్యుఁడ నని - భ్రమ నొంది దేహి

మఱపను నజ్ఞాన మహి - మంబు చేత
నరయనేరక యీతఁ - డతఁడు గాకుండు,

వెలయు దీపము నందు - వెలుఁగున్న కరణిఁ,
దెలియ భానునియందు - దివమున్న రీతి,

పొసఁగ జిత్తున జగం - బులు దోఁచుచుండు;
అసమాన చరిత! నీ - వంతరంగమున 350

భావింపుచుండు మీ - పరమ రహస్య
మే వేళ' ననిన ము - నీంద్రు నీక్షించి

పలికె శ్రీరాముఁడో - పరమ మునీంద్ర!
నెలవుగా క్షీరాంబు - నిధి తరంగముల

నలె నుండు మీ సార - వాక్యముల్‌ వినఁగ
నలఘు సుజ్ఞానోద - యం బయ్యె మదిని,

నడర జ్ఞానోదయం - బైయున్నఁ గాని
గడియగడియకుఁ జీఁ - కటియును వెలుగు,