పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

వాసిష్ఠరామాయణము

వలనుగాఁ జలి, యెండ - వర్ష మేఘంబు,
గలిగించు చందంబు - గా నా మనంబు 360

గలిబిలి చేసి సం - కల్ప వికల్ప
ములను బుట్టించు, ని - ర్మూలంబుగాదు;

అరయ ననంతంబు - నప్రమేయ౦బు,
పరము, నేకమును, స - ర్వము నైన బ్రహ్మ

యందు సృష్టి లయంబు - లగు వికారంబు,
లెందుకు జనియించె? - నీ హేతు వేమి?

యనిన వసిష్టుఁ డి - ట్లనె రాముఁ జూచి
'యనఘ! యథార్థ వా - క్యార్థంబు లగుచుఁ

దసరు పూర్వాపరా - ర్థ నిరూపణలకు,
మొనసి చూడ విరోధ - ములు గల్ల వెందు,370

సుజ్ఞానదృష్టిచే - సూటిగాఁ జూడ
నజ్ఞానభావంబు - నంట్టి మనంబు

రూపింప విద్యా స్వ - రూపమై వెలుఁగు:
నాపట్ల నస్త్ర మ - య్యస్త్రంబు చేతఁ,

గ్రమముగా గరళ మా - గరళంబు చేత
భ్రమ చెడ ఖండింప - బడినచందమున

ననుమాన విరహిత - మై యున్న సూక్ష్మ
మనముచేత మనంబు - మడియుచునుండు,

వెలయు ననాది య - విద్య యేరీతిఁ
గలుగునో యనుచింత - కడముట్ట విడిచి,380

విరతంబు సరతత్వ - నియతి సవిద్య
పఱిముఱిఁ జెఱచు టె - ట్లను విచారంబు