పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

103

ద్వితీయప్రకరణము

నభమందుఁ గలిసియు - న్న విధంబుగాను
శుభకర పరమ వ - న్తువునందుఁ గలియుఁ;

గావున నిప్పు డే - క్రమముననైన
నీ వింద్రియములను - నిగ్రహంపుచును

ధీర సంసార వా - ర్థిని దాఁటవలయు;
నారీతి చేయ క - హంకారభావ

కలితుఁడవైన దుః - ఖములు ప్రాప్తించు.
ఇల నిందు నితిహాస - మెఱిఁగింతు వినుము! 250

*శంబరోపాఖ్యానము*



జననాథ! పూర్వంబు - శంబరాసురుఁడు
పనిం బూని చతురంగ - బలములం గూడి,

'శక్రాది దివిజుల - సమయింతు' ననుచు
విక్రమాటోపంబు - విపులంబు గాఁగ,

ననిమిషావళితోడ - ననిఁ జేయు వేళ
మొనకు నిల్వక వాని - ముఖ్యబలంబు

విఱిగి డాఁగినఁ జాచి, - విపులదుఃఖమున
మఱియును వాఁడు దా - మ, వ్యాళ, కటులఁ

బుట్టింపఁగా, వారు - భూరిశౌర్యమున
నట్టహాసంబుతో - ననిఁ జేసి, సురలఁ 260

దజుమ, దేవతలా వి - ధాతను జేరి,
శరణుని శంబరు - సామర్థ్య మెల్ల

వినిపింప, విని ధాత - విబుధులఁ జూచి,
పనిఁబూని యొక్క యు - పాయ మూహించి,