పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

వాసిష్ఠరామాయణము

పలికె ని ట్లనుచు 'శం - బరుని మీ రిపుడు
గెలుచుట కొకయుక్తి - గెంటక వినుఁడి!

వాఁడు కయ్యము సేయ - వచ్చిన వేళ
నాడాడ డౌఁగుచు - నళికిన రీతిఁ

బోరాడుచుండుఁ డ - ప్పుడు విజయాశ
నా రాక్షసునియం ద - హంకార గుణము 270

పొడము, నందున వారు - పొలిసి పోవుదురు;
జడియక చనుఁడన్న - శక్రాదు లరిగి,

పొరిఁ బొరి దానవుల్‌ - పోరాడు తఱిని
వెఱచిన రీతిగా - విబుధు లందందు.

డాఁగుచుఁ బోరుచుం - డఁగ దానవులకు
వేగ నహంకార - వికృతి జనించె;

నాయహంకృతిచేత - నఖిలరాక్షసులు
నాయమరుల కోడి - యరిగి ' రటంచు

ముని దెల్పఁగాను రా - ముఁడు వెఱుఁగంది,
మనమున నూహించి - మరల ని ట్లనియె: 280

'కలుష దామ, వ్యాళ, కట - వామ భటులు,
నిలను బరాత్మ యం - దెటు గల్గి?' రనిన

మౌని యి ట్లనియె 'దా - మ' వ్యాళ, కటులు
పూని యద్భుతముగాఁ - బుట్టు టె ట్లనిన

నెరవొప్పఁ జెప్పెద - విను సూక్ష్మమతినిఁ
బరమాత్మ విప్రతి - భాతి మాత్రంబె

గావి సత్యంబులు - గా విది చెప్పఁ
గా నేల? రామ! త - క్కక నీవు, నేను